గజ్వేల్‌ అభివృద్ధి అద్భుతం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఇక్కడి ఆభివృద్ధి అద్భుతమని కొనియాడారు. దేశానికే గజ్వేల్‌ దశదిశ చూపుతున్నదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో తమప్రాంతాల్లో ఇదే తరహాలో అభివృద్ధి చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. పట్టణప్రగతిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం మంత్రులు ఈటల, జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, ప్రశాంత్‌రెడ్డి, సబిత, అజయ్‌, గంగుల, కొప్పుల, ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు మంగళవారం ప్రగతిభవన్‌ నుంచి నేరుగా బస్సుల్లో గజ్వేల్‌ సమీకృత మార్కెట్‌, వైకుంఠధామం, సంగాపూర్‌లోని కల్పకవనం, వర్గల్‌ మండలంలోని సింగాయిపల్లి అటవీప్రాంతాన్ని పరిశీలించారు.