దిశ : పోలీసులపై కేసు పెట్టారా లేదా?
సాక్షి, హైదరాబాద్ : 'దిశ'హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారో లేదో వెల్లడించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పౌర హక్కుల సంఘం (పీయూసీఎల్)–మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శాకాలను పోలీసులు అమలు చేసినదీ, లేనిదీ ఈ నెల 12న జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ఆదేశించింది.